పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

80

కవికోకిల గ్రంథావళి


బుద్దిగ్రాహ్యము లగు గుణ విషయములును హెచ్చుకొలఁది వానిని గ్రహించి తదనురూపానందమును బొందు రసికుల సంఖ్యయు తగ్గుచుండును, కావుననే కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలము జంగమ కథలవలె పామాన్య ప్రజానురంజకము కాకుండుట, రసజ్ఞత కుశాగ్రముగ నుండని దే యుత్తమమైన కళాసృష్టిని మెచ్చుకొనుటకు సాధ్యముకాదు. అట్లు మెచ్చు కొనుటకు శిక్షితమైన అభిరుచియు అవసరము. అట్టి రసజ్ఞత ప్రజాసామాన్యమునందు నభివృద్ధి చెందియుండదు. వారికిఁ దగిన శిల్పము లుండనేయున్నవి. ఇంక ను గావలసిన యెడల అట్టివి వేనవేలుగఁ గల్పించి క్రమక్రమముగఁ ప్రజల యభిరుచిని శిక్షించి యుత్తమశిల్పముల మెచ్చుకొనునట్లోనరింపవచ్చును గాని, యాదర్శమును మాత్రము జనబాహుళ్యము నకుఁ దెలియఁగల క్రిందిమెట్టులోనికి దింపరాదు. మేఘసందేశములోని రామణీయకము ఒక పల్లెటూరి కాఁపునకు గోచరింపని కారణముచేత దానిని సరస్వతీదేవి యంక పీఠమునుండి క్రిందికిఁ ద్రోయవలసిన దేనా ? "

కాళిదాస భవభూతులు సమకాలీనప్రజల యభిరుచి ననుసరించి వారి నాటకములను రచియింప లేదు. అట్లే వారు రచియించి యుండినయెడల అవి యెల్ల కాలమునకు నాదర్శ ప్రాయములుగ నుండనోపవు, ప్రజల యభిరుచిమాఱిన వెనుక వానిమొగము చూచువారుండరు, కాని శకుంతలనాటకము కాళిదాసుని యభిరుచి ననుసరింని సృష్టింపఁబడిన దగుట చేతనే చిరంజీవమైనది. ఈ విషయము కవులకుఁ దెలియనిది గాదు. తన నాటకములోని సారమును భవభూతి మహాకవి