పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మర్మకవిత్వము

79


తడిసేయును. కావున టాల్ స్టాయి నిర్వచనములందుఁ గళా న్యాయనిర్ణయమునకంటె గరుణారసమె యెక్కుడుగా నుండును, ఒక కళయొక్క శేష్ఠత్వము దాని నర్థముచేసి కొనఁగల ప్రజలసంఖ్య ననుసరించి యుండుననియు, నట్లుగాక యెవరో కొందఱిభాగ్యవంతులకును, కేవలము శిల్పాభిరుచి గలవారికిని మాత్రమే పనికివచ్చు కళ యొకకళ గాదనియు , ఆయన సిద్ధాంతీకరించెను. ఇది చాల యన్యాయ్యమును, శిల్పతత్త్వమునకు పరమవిరుద్ధమైన తీర్మానముగను నున్నది.

మన మొక కావ్యమును జదువునపుడు హృదయము రసాతిరేకమైనదా ? లేదా? యనుదాని ననుసరించియు, ఐనయెడల దానితీవ్రతనుబట్టియు ఆ కావ్యముయొక్క గుణా గుణములను నిర్ణయింతుము, ఒకప్పుడు కావ్యము రమ్యమైన దయ్యుఁ జదువరి హృదయము సంస్కారపక్వము గానియెడల రసోత్పాదనము గాకపోవచ్చును. ఈ రెండు సందర్భములందును కృతికిని చదువరి స్వభావమునకుం గల సంబంధము ముఖ్యము. కాని, 'ఇతరు లెందఱీకావ్యమును జదివి యానందించిరి?' అను ప్రశ్నపై అతని యనుభూతి ఆధారపడి యుండవలసిన యక్కఱలేదు. చిత్రముల విషయముగూడ నిట్లే యూహింపవలయును.

టాల్ స్టాయి సిద్ధాంత మంగీకరింపఁబడిన యెడల లోకమునందలి చాల యుత్తమోత్తములగు చిత్రములు, కావ్యములు, శిల్పములు,కట్టడములు ధ్వంసము కావలసి యుండును. ఒకరచనయొక్క రసవత్తతయు, కళానైపుణ్యమును, సూక్ష్మ