పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

78

కవికోకిల గ్రంథావళి


2. Vagueness is often a virtue; a god lives in a cloud, truth cannot be put on one's finger tip-Walter pater

3. I think there should be nothing but allusions. The contemplation of objects, the flying image of reveries evoked by them are sunk.........To name an object is to take the three quarters from the enjoyment of the poem, which consists in the happiness of guessing little by little, to suggest that is the dream. -Jues Huret,

ఈ లక్షణములు ముఖ్యముగ గీతకవిత్వమున కన్వయించును.

మర్మకవిత్వమును టాల్ స్టాయి 'శిల్పమననేమి?' అను తన గ్రంథమందుఁ జాలతీవ్రముగ ఖండించియున్నాడు. అందు కా కవిత్వమునఁ గల యగమ్యగోచరత్వము కారణము. అయినను టాల్ స్టాయి తర్కమంత సహేతుకముగఁ దోఁపదు. ఆయన ప్రజాపక్షవాది కావున సామాన్యజనుల కర్థముగాని శిల్పము వ్యర్థమనియు నింద్యమనియు ఆయన యభిప్రాయము. ఈ యపూర్వమైన మానదండమును గల్పించి టాల్ స్టాయి రషియా దేశమునందలివేగాక యూరపుఖండమునందలి యన్ని దేశముల లలితకళలను దానితోఁ గొలిచి, సరిపడని వానిని తన విపరీతపు విమర్శనమునకు గుఱి గావించెను. ఒక పెద్దసౌధమునుగాని, క్రైస్తవుల ప్రార్థనాలయమునుగాని దిలకించినప్పుడు వాని సౌందర్యముఁ దోఁచుటకుఁ బూర్య'మే ' ఈ కట్టడము లెందరి పాటక పుజనులనిట్టూర్పుల తోడను, గన్నీటితోడను, కడుపుమంటలతోడను రూపొందినవో' యను కారుణ్య మా దయాశాలి మెత్తనిమనసును