పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మర్మకవిత్వము

77


గలడు ? అను సొశ్చర్యము దోఁపకమానదు. జపానుకవుల * [1]'హొక్కు' కవిత్వమునందువలె ఈ చిత్రపటమునందును అనవసర కళా ప్రదర్శనము నాకగపడ లేదు. అయినను అందు సౌందర్వమును నిరాడంబర తయుఁ దొల కాడుచున్నవి. అట్టి యస్పష్టతయు సంక్షి, పతయుఁ కేవలము అనల్పకళానై పుణ్య సాధ్యములని నేనుగ్రహించితిని,

మర్శకవిత్వమునందలి యస్పష్టతనుగుఱించిన కొందటి యభి ప్రాయముల నీట సంకలించితిని :

i. And the very perfection of such poetry often appears to depend, in part, OD 4 certain suppresssion or vagueness of mere subjects, so that the meaning reaches us through ways not distinctly traceable by the understanding -- Yone Norjuchi.

  1. *జపాసు కవిత్వ పద్య భేదములందు ' హక్కు' అనునది చాల చిన్న పద్యము. అది పదునేడు నేకాచ్క శబ్దముల పరిమితి గలది. ఈ పద్యముల లోని విషయము జపాను దేశస్థులకుఁదప్ప, ఇతరులకు సాధారణముగ బోధ పడనంతటి సంక్షిప్తముగ నుండును. అందువలననే జపాను వాజ్మయ విమర్శకులు 'కవి యెట్టివాఁడొ పాఠకుఁడును నట్టివాఁడుగ నుండవలయును' అని చెప్పుట. 'హెక్కు' పద్యముల రచించుట చాల కష్టమనియు, బాషో అను సుప్రసిద్ధ 'హెక్కు' కవి తన జీవితమునందు మూడు నూర్ల పద్యములను మాత్రమె రచింపఁగలిగెననియు, యోన్నెగూచి తెలిపియున్నాఁడు. విషయముఁ దెలుపుట కొక ఉదాహరణము ననువదించితిని;

    కాలిపోయెసు శాల; రాలెడుపూవు
    లెంత నిశ్చలశాంతి నెసగెడు నిపుడు!

    తనయిల్లు కాలిపోవు నమయమున రాలెడుపూవుల నిశ్చలశాంతిని డమనింపఁగల కవి మనోవస్థయే యీ పద్యమునందలి విశేషము.