పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

కవికోకిల గ్రంథావళి


ఆ చిత్రపటముల మూలమున నేరుగ నామనమున నంకితమైనది. అంతవఱకు ఆకవిత్వములోని యస్పష్టత (Vagueness) యొక్క గుణమును నేను పూర్ణముగ గ్రహింప లేకుంటిని. శివనాట్యమును, మంచుకాలమున జపాన స్త్రీల సంచారమును చిత్రింపఁబడిన పటమును సాధారణమైన బొమ్మలపటముల వలె పరిస్ఫుటముగ రంగులు పూయఁబడినవి కావు. వానిలోని యాకృతులు మనకు అస్పష్టముగఁ బొడకట్టును. ఆ యస్పష్టత శిల్పకళానైపుణ్యముయొక్క పరసీమయని తలఁప వలయునేగాని, అల్పకౌశలముగల చిత్రకారుల వచ్చీరాని బీరకాయపీచుఁదనముగాదు. అట్లు చిత్రించుటకు శిల్పి చాల కళాభిరుచి గలవాఁడుగను, చేయితిరిగినవాఁడుగను, వర్న సమ్మేళనాదివిషయములందుఁ బరిపూర్ణజ్ఞానము గలవాడుగను నుండవలయును. ఆ పటములయందలి రూపములనుఁ దిలకించినపుడు మన మనస్సు గాలిలోఁ దేలిపోవునటులఁ దేలికయై చిత్రసారూప్యమును బొందినట్లుండును, ఆ రూపము ఏదో యొక యగాధ రహస్య వాలెవరణమున, వెన్నెలరాత్రి యందుఁ దేలియాడు. మేఘశకలములవలెఁ బొడకట్టును. చూడఁజూడ నవి గాలిలోఁ గరగిపోవుచున్నవా యేమి? యను సంశయముగూడ పొడమును. ఇట్టి యస్పష్టతామాధుర్యమే నాకు మర్మకవిత్వమునఁ దోచుచున్నది. రేఖలతో లిఖంపంబడిన పటమును గాంచినపుడు 'ఎన్ని కొద్ది గీరలతో నెంత సుందరమైన యాకృతిని నేర్పరియైన చిత్ర కారుఁడు సృజింపఁ