పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మర్మకవిత్వము

75


'ఏమో నేను జెప్పజాలనుగాని, యొక విధమైన యవ్యక్త మాధుర్యమును, ఆనందమును అనుభవించితిని' అని చెప్పుటకు మాత్రము సాధ్యమగును, కళయొక్క పరమావధియు నిట్టి యనిర్వచనీయమైన రసానుభూతిని గలిగించుటయే యని యన్ని సంప్రదాయములకు సంబంధించిన రసజ్ఞులును, శిల్పులును నిర్ణయించిన విషయమే. 'When one art can fully be explained by another then, it is a failure' అని రవీంద్రుఁడు కళయొక్క యనిర్వచనీయతను బోధించెను. “It (art) is to be felt, not to be explanned.' శిల్పము అనుభవింపఁ దగినదిగాని, వివరింపవలసినదిగాదని డాక్టరు అవనీంద్రనాథ టాగూరు నుడివియున్నాఁడు. ఇట్లనుటవలన ఉత్తమశిల్పము నందు వివరించి చెప్పనలవిగాని యొకవిధమైన రసస్ఫురణము గలదని మనము తెలిసికొనవచ్చును.

అడయారునందు జెమ్సు హెచ్ . కజిన్సుగారి యింట నేను మూడు చిత్రపటములను జూచితిని. ఒకటి నందలాలు వసువు రచియించిన 'శివనాట్యము'. మఱిరెండు కజిన్సుగారు జపానునుండి తెచ్చినవి. వానిలో నొక దానియందు జపాను స్త్రీలు మంచుకాలమునఁ గాగితపు గొడుగులు వేసికొని సంచరించుట చిత్రింపబడియున్నది. మఱియొక దానియందు కేవలము సన్ననిగీతలతో _నవియు నేడెనిమిదింటితో, నొక జపాను దేశపు స్త్రీముఖము అత్యద్భుతముగ నింపఁబడి యున్నది. ఈమూడు చిత్రములు నా హృదయమును హరించినవి. మర్మకవిత్వము (Mystic poetry) యొక్క రహస్యము