పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

74

కవికోకిల గ్రంథావళి


కినిఁ గొంత భేదము గలదు. అయ్యది దేశకాలపరిస్థితులకు సంబంధించినది. ఐరిషుకవుల కుండినంత ప్రకృతి సాంగత్యము ఫ్రెంచికవులకు లేదు. అందువలన వారి కావ్యములందుఁ గొంత కృత్రిమత పొడకట్టుచున్న ది. మనకు సమకాలీనుఁడైన ప్రసిద్ధ ఐరిషుకవి, *[1]ఈట్సు రచియించిన ఈపేరిన తేనెగడ్డను చవిచూడుఁడు:

In all poor foolish things that live a day
Eternal beauty wandering on her way,

ఈకవి తన యాత్మానుభూతిని పై రెండు పాదములలో నిమిడ్చియున్నాఁడు; అనంత సౌందర్యమును బ్రతివస్తువునందు సందర్శించినాఁడు.

'............................సత్కవిశ,
భావలోచన మెరవుగాఁ బడయకున్నఁ
గాంచనేర వంతర్లీన కాంతిసరణి.'

-కృషీవలుఁడు

సత్యము! సత్కవీశుని భావలోచనముగాక, అంతర్లీన కాంతిని సౌందర్యమును తక్కిన కన్నులు చూడఁగలుగునా?

మర్మకవిత్వమునం దొకవిధమున యస్పష్టతయు ననూహ్యమైన భావ నేంద్రజాలమును గోచరించుచున్నది. ఆ గీతములందు భాపములు అంటీయంటక-చిక్కీ చిక్కక -దక్కీ దక్కక-మనతో దాఁగుడుమూత లాడుచుండును. 'ఆ కావ్యము నుండి నీ వేమి గ్రహించితివి?' అని యితరులు ప్రశ్నించినపుడు

  1. వీరికి నోబెల్ వాఙ్మయ బహుమాసము వచ్చినది
*