పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

కవికోకిల గ్రంథావళి


దేవదానవులు, స్వర్గమందుఁ బ్రవహించు గంగానదిని భూమికి నవతరింపఁ జేయఁగల భగీరధులు, సృష్టికిఁ బ్రతిసృష్టిగావింపఁ గలిగిన విశ్వామిత్రులు!

నీ పట్టణములోని చంద్రశిలా సౌధములు సూర్యచంద్రుల రాకపోకల నడ్డగింపఁగల యంతటి యున్నతములు, నీతోఁటలోనివృక్షములెల్ల ఫలవంతములు, లతలెల్లఁ గుసుమభరితములు, షడృతుధర్మము లేక కాలమున నీ యుద్యానమును సేవించుచుండును, ప్రకృతియంతయు నీ దృష్టికి సచేతనము, మేఘములు, హంసలు, కాముకీ కాముకుల ప్రణయ సందేశములఁ గొనిపోవుచుండును!

ఓయీ, నీసృష్టి కాలబద్దముగాదు. అనుక్షణ యౌవన విజృంభణమువలన, కంచెల బిగియుచుండ "ప్రియంవద నిర్దయముగ నా కంచెలవల్కలమును బిగించి ముడివేసినది. నీవు కొంచెము సడలింపుము” అని యనసూయతో ముగ్ధముగఁ బలుకుచుఁ బూఁదీవలకు జలసేచనము సేయుచుండిన శకుంతల దుష్యంతుని కన్నులకు నిర్వాణసామ్రాజ్యమై కనుపట్టిన శకుంశతల, నేఁటికిని అదేవిధముగ మా కన్నులకు బొడకట్టు చున్నది! కాని, ప్రకృతి సృజించిన శకుంతల యేమైనది? యౌవనమును, సౌందర్యమును గాలక్రమముగఁ గోలుపోయినది. జరాభార మామెను సైతము పీడించినది. తుట్టతుదకు ఆ మోహనదేవత, ఆ శకుంతల యనంతకాల సాగరమున బుద్బుదమువలె మఱఁగిపోయినది!

ఓ యైంద్రజాలికుఁడా, నీవు కుంచె నొక్కసారి విసరి నంతనె మాయాత్మలు తేలికయై పూలఱేకులు ఱెక్కలుకట్టు