పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మర్మకవిత్వము

73


గోచరములైన విషయము లుండును. సాధారణముగ నీ తరగతి గీతముల వస్తువు ఆధ్యాత్మిక విషయముగ నుండును. కవియొక్క యాంతరంగికానుభవమును విశ్వజనీనతయు గీతములయం దంకితమై యుండును. కవులయం దాధ్యాత్మిక స్వభావము నిర్నిద్రము. కావున వారు బహిరింద్రియ నిర్ణీతములైన సీమలనుదాఁటి సూక్ష్మప్రకృతినిఁ బ్రవేశించి యందుఁ గలిగిన యనుభూతిని ధ్వనీమూలకముగనో, సూచనగనో, సాంకేతికముగనో వెలిపుత్తురు. ఈ మర్శకవిత్వము కేవలము ఆత్మానుభవజనితముగను, ఆత్మోపభోగమునై యున్నది. జీవనముయొక్క యవ్వలిగట్టు ఈ గీతములందుఁ బొడకట్టుచుండును. యూరపుదేశపు సామాన్యజనులకు ఆధ్యాత్మిక గంధము శూన్యము. కావున వారి కీకవిత్వము మర్మముగఁ దోఁచినది. బాడిలేర్ కవిత్వము ఆధునిక పాశ్చాత్యమర్శకవిత్వమునకు మార్గదర్శకమైనదని యిది వఱకుఁ దెలిపియుంటిని. ఆతని రచనలోఁ జాలప్రసిద్ధమైన ఈ క్రింది పద్యములలోని యగాధాశయములను గమనింపుడు:

Earth is a temple, from whose pillared mazes
Murmurs confused of living utterences rise;
Therein man thro' a forest of symbols paces,
That contemplate him with familiar eyes.
As prolonged echos, wandering on and on,
At last in one far tenebrous depth unite,
Impalpable as darkness, and as light,
Scents, sounds, and colours meet in unison,

ఈ తెగ కవులలో మఱల ఫ్రెంచివారికిని ఐరిషువారి