పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

72

కవికోకిల గ్రంథావళి


ఆర్థరె సిమ్మన్సు.*[1] జేమ్సు హెచ్. కజిన్సు మున్నగు కవులును ఈమర్మకవిత్వసంప్రదాయమునకు సంబంధించినవారు.

మర్మకవిత్వము సామాన్యముగ గీతి ( Lyric) రూపమున నుండును. ఆ గీతములందు గానమునకును భావమునకును సమానగౌరవము గలదు; ఒకవేళ గానమే ప్రాధాన్యము వహించినదనిగూడఁ జెప్పుటకు వీలున్నది. కావ్య రూపములలో గీతమే యుత్తమోత్తమ మని కొందఱి యాథునికుల యభిప్రాయము. మర్శకవులు తక్కువపదములలో నెక్కువగానమును, నూచనలను గర్బీకరింతురు, పాల్ వెర్లెన్ ఈ తెగ కవిత్వమునకు లక్షణముగఁ గ్రింది గీతముల రచించెను.

Music, Music before all things
The eccentric still prefer,
Vague in air, and nothing weighty,
Soluble, yet do not err,
Choosing words, still do it lightly,
Do it too with some contempt.

Music always, now and ever
Be they verse the thing that flies
From a soul that's gone escaping,
Gone to other loves and skies.

ఈ కవిత్వమునకు మర్మకవిత్వ మని యేల పేరు రావలయును? ఈ కావ్యములందు సామాన్యప్రజల కగమ్య

  1. వీరిప్పుడు మదనపల్లి థియొసాఫికల్ జాతీయకళాశాల ప్రిన్స్‌పాల్‌గా నున్నారు