పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

68

కవికోకిల గ్రంథావళి


గోరిక పుట్టును. ఇది జిహ్వాచాపల్యము. మనదృష్టి కోరిక తీర్చుకొనుట యందే లగ్నమయి యుండునుగాని, దాని యుపయోగమును గుఱించిన తలంపె సాధారణముగఁ గలుగదు. కాని, మనము తలంచినను, తలంపకపోయినను మిఠాయి తినుటవలన రెండులాభములు చేకూఱినవి. ఒకటి: కోరిక తీరుటవలన గలుగు తృప్తి , రెండు ; దేహపుష్టి. ఇచ్చట మిఠాయిలోని మాధుర్యము రుచిచూచుటవలన గోరిక తీరినది. ఆమాధుర్యము, ఆహారవస్తువు నాశ్రయించి యుండుటవలన దేహమునకు బలము కలిగించినది. కాని, మాధుర్యము మాత్రము కోరిక తీర్చునదిగా నుండి తదాశ్రయవస్తువు అనారోగ్యకరమై యుండినయెడల దాని ప్రతిఫలమును మనము తప్పక యనుభవింతుము; ఈ సాదృశ్యమును కావ్యములో రససౌందర్యములకును, కధాభాగమునకును వాని ననుభవించు మానవసమాజమునకును నన్వయించి చూడుఁడు; అంత్యఫలితము మీరే యూహింపఁ గలరు;

మానవస్వభావ నిర్మాణమునందుఁ బరిస్థితులు చాల ముఖ్యములని మనస్తత్వ శాస్త్రజ్ఞులెల్లరు నొప్పుకొన్నవిషయమే ! కావ్యములం దట్టి పరిస్థితులు గలవు, ఇంద్రియ గోచరములగు విషయములు మనల నెట్లు లోఁగొనునో, కావ్యాంతర్గత విషయవర్ణనముకూడ నట్లే మనల వశవర్తులఁ జేసికొనును. కావున కావ్యములతోఁ గవికిఁ గల సంబంధము కన్నను దానిని జదివి యానందించు లోకుల కెక్కు డుసంబంధము గలదు.