పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

67


నందు మన కలవాటుపడియున్న యౌచిత్యమునకును వైరుద్ద్యము సంభవించినది. అందలి రమ్యత సర్వజనోపభోగ్యమగు నంతలేదు. సభ్యముగ ఇట్టి చిత్రములు ఆహ్లాదమును గలిగించి మనసు నుద్దరించుటకు నూఱు, ఇంద్రియచాపల్యమును, అసభ్యములగు మనోవికారములను బ్రేరేపించు చుండును. అట్లుచేయుట యుత్తమకళయొక్క ధర్మముకాదు.

అట్లయినయెడల మానవచర్యలకు సంబంధింపని వనములు, కొండలు, మేఘములు, ఉషస్సులు, సూర్యాస్తమయములు మున్నగు దృశ్యముల ప్రతిలేఖనములు కాంచు వారలకు ఆనందము గలగించునుగదా! అట్టి చిత్రమునందుఁ గూడ నీతి అంతర్లీనమై యున్న దా ? అని కొంద ఱడుగ వచ్చును. అట్టి చిత్రములు అనీతిస్ఫోరకములు గాకుండుట చేతనే వానియందలి రామణీయకమును బ్రతిబంధకము లేక మన మనుభవింతుము. నీతి సౌందర్యమునకు హేతువుగాదు; పరిపూర్ణతకు ఆవశ్యకమైన యొక ఔచిత్యము,

కావ్వమునందు శిల్పనైపుణ్యము హెచ్చుకొలఁది యందలి కథాభాగమునకుఁ జదువరుల హృదయము నాకర్షించు శక్తియు హెచ్చుచుండును. గుణ మెప్పుడు వస్తువు నాశ్రయించియుండును. గావున నితరకళలయందు వలెనే కావ్యమునందును వస్తుగుణములు రెంటికిని వానివానికి దగిన ప్రాధాన్యము గలదు.

మానవుని ప్రతికోరికకును రెండుదిక్కులు గలవు. మొదటిది వాంఛాపరిపూర్తి; రెండవది తజ్జనితమైన యుపయుక్తి. ఒక యుదాహరణము: మిఠాయినిఁజూచినపుడుతినఁ