పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

66

కవికోకిల గ్రంథావళి


హరిశ్చంద్రునిపై భక్తి గౌరవములు గలుగకపోవు. మన మెవరిని ఉత్తములని మెచ్చుకొందుమో వారి ననుకరింప వలయుననియో, వారివలెఁ బ్రవర్తింపవలెననియో మన మభిలషింతుము. ఈకోరిక మనయందు సహజముగఁ బుట్టును. సత్కావ్యములయందు ఇట్టి యున్న తాశయములను, ఆసలను బ్రేరించు శక్తిగలదు. *[1]బలాత్కార నీతిబోధనమునకు కావ్యము లెన్నఁడును బూనుకొనఁగూడదు. అట్టివి కావ్యములుగాక మనుధర్మ శాస్త్రములవంటి స్మృతులుగ మాఱును. కళలయందలి నీతి యంతర్లీ నమై యలక్షితముగ మన హృదయముఁ బ్రవేశించును. దాని పదచిహ్నము లదృశ్యములు. ఇట్లు రచించుట కళానైపుణ్యము.

కావ్య మర్థింపవలసినది రససౌందర్యము లేకదా ! అంతర్లీనమైన నీతియైనను వానికెటుల నుపకరించును? అను సంశయము కొందఱకుఁ గలుగవచ్చును, నీతిస్పర్శ లేనిదే సౌందర్యము పరిపూర్ణముగాదని నాయుద్దేశము. ఈదృష్టితో మనము విమర్నింపఁబూనినయెడల ఏదేశముయొక్క యుత్తమశిల్పమునందుఁగాని యనీతిపరత్వము గోచరింపదు. ఒక చిత్రకారుఁడు రమణీయవతియగు కాంతను విగతవస్త్రనుగఁ జిత్రించి మనకుఁ జూపినయెడల ఆ సౌందర్యమునంతయు మ్రింగివేయఁగల యసహ్యముపుట్టి మొగము చిట్లించు కొందుము. ఎందువలన? ఆ చిత్రపటమునకును జీవితము

  1. The office of poetry is not normal instruction, but moral emulation; not doctrine, but inspiration right|G. H. Lews right|The Inner Life of Art