పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

65


బరిపాలించునది నీతి. నాగరకత హెచ్చుకొలఁది అధికార ముద్రాంకితములగు శాసనములకంటె స్వయమారోపితములగు నీతు లే మనుష్యసంఘమును బాలించుచుండును. విరుద్ద శాసనమునకు లొంగియుండుట దాస్యమైనను స్వయంకృత నియమమునకు వశవర్తియై యుండుట స్వాతంత్ర్య మనఁబడును.

నీతులును శాసనములును (స్వయంకృతములైనను, పరకృతములై నను) సంఘమును శాసింపనియెడల వ్యక్తి స్వాతంత్ర్యము నశించి మానవజాతికిఁ బ్రళయము సంభవించును. కావున నీతి మానవులయం దన్యోన్య ప్రవర్తనానుగుణ్యమును బోషించును.

కళలు సాంఘిక జీవితముయొక్క యుచ్చ్వాస నిశ్స్వాసముల యాదర్శక లేఖనములని యిదివఱకే తెలిసికొని యుంటిమి. కావున జీవిత మొక వంకను, కళలు వేఱొక వంకనుఁ బ్రవహింప నేరవు. సాధారణ జీవితమునందు నేవేవి నీతిబాహ్యములుగను, నేవము పుట్టించునవిగ నుండునో అట్టివి కళలయందును నింపుగొలుపవు. అట్లగుట కావ్యమునకును నీతికని సంబంధ మెట్లు తెగిపోవును?

ధర్మ శాస్త్రములు వేఱు; కావ్యములు వేఱు, వాని వాని ప్రయోజనములును భిన్న ములు. పాలనాదండము చేతబట్టుకొని 'సత్యంవద' 'ధర్మంచర' అని వేదములు శాసించును. కవి 'సత్యంవద' అని శాసింపక హరిశ్చంద్రుని సృజించెను. 'సత్యమేవజయతి' అను ధర్మ వాక్యమునకు హరిశ్చంద్రోపాఖ్యానము లక్ష్యము. ఆకథను జదివినవారికి