పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

62

కవికోకిల గ్రంథావళి

One thing is certain and the rest is lies:
The flower that once has blown for ever dies.

Many knots unravelled by the road.
But not the knot of human death and fate;
There was a door to which I found no key.
Tbere was a veil past which I could not see.

While you live, drink;
for once dead, you never shall return,

ఉమ్రఖయ్యాము కొంచె మించుమించుగా చార్వాక మతస్థుఁడు. 'వికసించిన పూవు మరల వికసింపఁబోదు. మరణించిన మానవుఁడు మరల తిరిగి రాఁబోఁడు, పొణముండఁగనే భోగము లనుభవించెదము. చచ్చిన వెనుక యేమగునో ఆ విషయము నాకు తెలియదు. ఆ ముడిని నేను విప్పఁజాలక పోతి' నని చెప్పెను. అట్టివారికి జీవితము భోగమాత్ర ప్రయోజనము. జీవితము ననుసరించి శిల్పముగూడ విషయభోగముల ప్రతిబింబముగ నుండును,

కాని, మన విశ్వాసములు వేఱు. ధర్మార్థ కామ మోక్షములను నాలుగు పురుషార్థములను మానవజీవితము సాధింపవలయునని మన పెద్దలు నిర్ణయించరి . వారు ఇహ పరిముల రెంటికిని సమాన గౌరవమును చూపియున్నారు, సన్న్యాస మనునది అతీత ధర్మము. లోకసామాన్యము 'గాదు. ధర్మార్థ కామమోక్షములు పరస్పర సాపేక్షములు కావున, మన కవిత్వ ప్రయోజనము, జీవితాదర్శకము నను