పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

కవికోకిల గ్రంథావళి


వాదించువారికిని నాకును భిన్నాభిప్రాయము గలదు. ఈ విషయమును గొంచెము చర్చింతము.

కావ్యమందు రామణీయకము ముఖ్యము; తక్కిన గుణములు అందుకు పోషకములుగ నుండవలయును. రామణీయకమనునది ప్రతిభావంతుఁడైన గవియొక్క రచనా నైపుణ్యమునకు సంబంధించినది. గుణమెప్పుడు తనకాలంబమైన వస్తువును ఆశ్రయించియుండునుగాన, వస్తుగుణములు రెంటికిని ప్రాధాన్యము గలదు. ఒకవేళ నీతిబాహ్య మైన వస్తువు రమణీయమై యుండినయెడల షేక్సిపియగు (Shakespeare) మహాకవి సృజించిన క్లియోపాట్రా (Cleopatra) కస్యవలె మానవలోకమున కుపద్రవము గలుగఁజేయును. శకుంతెలవలె అనుభోగ్యము గాదు

మఱియొక పూర్వపక్షము గలదు: శిల్పముకొఱకే శిల్పము' (Art for art) అనఁగా శిల్పమున కేలాటి బాధ్యతలు లేవు. కవి భావోదేకమువలనఁ దనకిష్టమైనరీతిని గానము చేయును. అట్లుచేయుట యితరులకొఱకుఁగాదు; తన సంతోషమునకు, కోకిలకూయుట యెవరిని ఆనంద పెట్టుటకొఱకు? ఈ వాదము మొట్ట మొదట వినుటకు ఇంపుగానే యుండును; కాని విమర్శించుకొలఁది యందలి లోపములు బయలువడును. కోయిలకూఁతను విని మన మానందించుచున్నాము; నిజమే, దానికూఁత మధురముగ నుండుటవలనను ఆ కూఁత మనకు సమ్మతమగుటవలనను మనము సంతోషించుచున్నాము. అది తన కిష్టము వచ్చినట్లు కూయుటవలనఁ గాదు. కాకిగూడ తన కిష్టమువచ్చినట్లే కూయును. దానిని మన మేమాత్రమాద