కవిత్వ తత్త్వ నిరూపణము
59
గాదని మఱియొకరి యభిప్రాయము. ప్రాచ్యులకు జీవితము పరమార్థమును సాధించుటకై ఏర్పడిన యొక యుపకరణము. పాశ్చాత్యులకు, జీవితమే యొక పరమార్ధము. కావున యిట్టి మార్గభేదములు రెండు ఖండములయొక్క లలితకళల యందు నస్థిగతముగ నంకితమైయున్నవి. ప్రాచ్యశిల్పము, నందు రూపయథార్థ్య మంతముఖ్యముగాదు ఏలయన, వారిశిల్పము చాలవఱకు సాంకేతికము. సాంకేతికశిల్ప మెప్పటికి కొన్ని శిల్పసమయములకుఁ గట్టువడియుండును. అజంతాగుహలయందలి రేఖాచిత్రములు ఈతరగతి శిల్పమునకుఁ బ్రబలమైననిదర్శనములు. మనశిల్పము ధ్యానమూలకము; వారిశిల్పము ప్రకృత్యనుకరణము. .
'కళలయందు రసరామణీయకములె ప్రధానములు కాని, నీతికిని ఆధ్యాత్మికభావములకును నేమిసంబంధము గలదు? అని కొందఱు విమర్శకులు ప్రశ్నించుచున్నారు. ఇది మనకు నవీనమును విజాతీయమునునైన సందేహము, ఆస్కర్ వైల్డు (Oscar Wildr) అను నొక ఆంగ్లేయ విమర్శకుఁడు *[1]కళలన్నియు నీతిబాహ్యములనియు. నీతియనునది యేదోకొద్దిపాటి తెలివితేటలు గలవారికేగాని, ప్రతిభావంతులకు నీతి యనవసరమనియు చెప్పియున్నాఁడు. ధర్మశాస్త్రములయందు వలె కావ్యములందు నీతిబోధ యనవసరమనుటయే ఆయన యుద్దేశమైనయెడల మే మిరువురము ఏకాభిప్రాయులమే. కాని నీతికిని కావ్యమునకును ఏలాటి సంబంధములేదని
- ↑ All the arts are immoral. To morals belong the lower and less intellectual spheres. Intertics