పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

కవికోకిల గ్రంథావళి


బాలించుచున్నది! కాలము మాఱినది, చక్రవర్తులు గతించిరి. రాజ్యములు బంతులవలె నొకరిచేతినుండి మరియొకరి చేతికి దుమికినవి, మతములు పుట్టి చచ్చినవి, చచ్చిపుట్టినవి, అన్య దేశ నాగంకతా సంఘర్షణము గలిగినది. ఆచార వ్యవహారములు మాఱినవి. పూర్వార్యావర్తమెఁ రూపము మార్చుకొని క్రొత్తదేశమైనది కాని, మన జాతీయకావ్యములు ప్రాతపడలేదు, వాని యధికారమింకను మొక్క వోలేదు. హైందవ జీవన ప్రవాహమునకు ఆ కావ్యములు తటములవలె నున్నవి. కాలమా, తీవు చచ్చితివి! రామాయణ మహాభారతములు చావ లేదు; అవి చిరంజీవములు!

9. కావ్యము : నీతి

మతము, శాస్త్రము, ధర్మము, లలితకళలు మున్నగునవి వానివాని కుచితమైన రీతుల మానవ శిక్షణమునకుఁ దోడ్పడు సాధనములు. కొన్ని బుద్దిని ఉత్తేజన మొనరించునవి. మఱికొన్ని హృదయమును పరిపక్వపఱచునవి.

ప్రతియుగమునందును బ్రతిసంఘమునందును కాలమునకంటె ముందు నడచు ప్రతిభావంతులు, విప్లవకారులు దూరదృష్టి గలవారు కొంద ఱుదయించుచుందురు. అట్టి మహనీయుల భావములు, సృష్టులు ఆ యుగమునకు, ఆ సంఘమునకు ఆదర్శకములుగ నుండును, ఆపురుష పుంగవులు మార్గ ఋషకులు; అస్ఫుటముగను, అవ్యక్తముగనున్న భావికాల నిఁక నా--- కన్నులకుఁ బొడకట్టునట్లు చేయఁగల మహిమా