పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

55


ర్శక కవుల కావ్యములందైనను దేశ కాలములు తమ పద చిహ్నముల ముద్రింపకపోవు, రామాయణ మహాభారతములు ఆయాకాలమునాఁటికి హైందవ సంఘముయొక్క. ఆదర్శక ప్రతికృతులని తలంపవచ్చును.

మనో వికారములను, భావములను శిక్షించి, సంస్కరింపఁగల యనుభవములు మాటిమాటికి లోకమునఁ దటస్థింపవు. ఒకవేళ తటస్థించినను, అవి పరిపూర్ణముగను, ఆదర్శక ప్రాయముగను నుండవు. కాని, ఇట్టి యనుభూతులను కావ్యములందు మనము యథేచ్చముగఁ బొందవచ్చును. కవిత్వ సంపర్కమువలన సంకుచితభావము తొలఁగి యఖండ జీవముయొక్క పరతటము నంటఁగలము. క్రమముగ మన స్వభావము సున్నితముగ మాఱి తిలకించు ప్రతి వస్తువునందు సౌందర్యమును గుర్తించి యానందింపగల యభిరుచి హెచ్చును. కావున కావ్యము మానవప్రకృతి నుద్దరింపఁగల యొక మనోహర సాధనము,

సంఘముయొక్క సంయోగతను బోషించుటకుఁగూడ గావ్యము లమోఘ సాధనములు. అట్టి ప్రబంధముల యందలి సర్వజనీన భావములు ప్రజనందఱిని నేక సంప్రదాయ బద్దులను గావించి, సంఘముయొక్క యైక్యమును బలపఱచును. రామాయణ, మహాభారతములు లేకుండిన హైందవ సంఘ మేమై యుండునో! హిమవత్పర్వతము మొదలు కన్యాకుమారి పఱకుఁ గల యీ విశాల భారత దేశమున నీ రెండు జూతీయ కావ్యములను జదువని, వినని హైందవుఁడుండునా? ఎన్ని శతాబ్దములనుండి యీ కావ్యద్వయము మన సంఘమును.