పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

53

వదలు మున్నగు సఖులలో నేను గూడ నొకఁడనియు దలపోసి వారి సుఖ దుఃఖములను నేనును బంచుకొనుచుంటిని. కణ్వుని యాక్రోశము నాకర్ణ పుటముల గింగురుమని మాఱుమ్రోయు చుండెను. కాని నేను చదువుచుండినది నాటకమనియుఁ గాళిదాసుని యసదృశమైన రచనా చమత్కృతియుఁ బ్రతిభయు నన్నటుల ముగ్ధుని గావించినదనియుఁ దెలిసికొనుటకు నాకుఁ జాలసేపు పట్టెను. మనసు సామాన్య శ్రుతిలోఁ బడిన వెనుక , కల గని నిదుర లేచిన యనంతరము స్మృతిలేశములు స్ఫురించునటులఁ గణ్వుని సంసారము నా భావమునకుఁ బొడ్డకట్టు చుండెను. హెన్రీవుడ్ అనునామె రచిచిన 'ఈస్ట్లి ను* అను నవలలోని కడపటి యధ్యాయమును, 'ఒథెలో' నాటకములోని “హత్వరంగమును' జదువుచుండినపుడు నాకుఁ దెలియక యే నేను గన్నీరు. నించుచుంటిని. ఈయవస్థ నాకెంత సేపుండెనో తెలియదు. తెలిసినప్పుడు, నేలపై జారిపడినవాఁడు తన్నెవరైనఁ జూచుచున్నా రాయని యటు నిటు పరికించునటుల లజ్జాకరమైన నాస్థితిని ఎవరైనఁ గాంచు చున్నారాయని పాఱఁజూచి అచ్చట నెవరును లేకుంట నెఱింగి తృప్తిపడితిని. కావ్యలోకము ఆ సమయమునకు సత్యమని తోఁపనిదే మనకు సహానుభూతి యెట్లు గలుగును !

జర్మను కవి శేఖరుఁడగు గెతె కావ్య ప్రయోజనములను గొంచె మించుమించుగ మన యాలంకారికుల వలెనే నుడివియున్నాఁడు.

“Each age has sung of beauty,
 He who perceives is from himself set free"