పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

52

కవికోకిల గ్రంథావళి


8. కవిత్వ ప్రయోజనము

కావ్య ప్రయోజనములను గుఱించిన మన యూలంకారికుల మతము ఈ క్రింది శ్లోకము వ్యక్తపఱచుచున్నది.

శ్లో॥ కావ్యం ,యశసే౽ర్థకృతే,వ్యవహారవిదే శివేతరక్షతయే
     సద్యఃపర నిర్వృతయే కాన్తాసమ్మితతి యోపదేశయుజే.

ఇందు "సద్యఃపరనిర్వృత యే" అనునది ముఖ్య ప్రయోజనము. ఆనందాస్పదమయిన రసోత్పాదకత్వమె లలిత కళల గంతవ్యము. శాస్త్రము \యొక్క కార్యము వస్తుతత్త్య పరిశోధనము, శిల్పముయొక్క పని వస్తువు నావరించిన మనోహరత్వమును మూర్తీభవింపఁ జేయుట. మొదటి దాని ఫలితము విజ్ఞానము. రెండవ దాని ఫలితము ఆహ్లాదము.

కవి యేమనోవస్థలోఁ దనకావ్యమును రచియించెనో ఆ యవస్థనే సహృదయుఁ డా కావ్యమును జదివినప్పుడు పొందును, సంకుచితములైన ప్రపంచసీమలను భేదించుకొని మనస్సు విశాలమయిన భావప్రపంచమున అనిర్వచనీయమైన యానందము ననుభవించును, కావ్య జగత్తునందుఁ జిత్తము లగ్నమైనపుడు అదియు బాహ్యప్రపంచము వలె యదార్థముగ దోఁచును. ఒకనాడు నే నభిజ్ఞాన శాకుంతలముఁ జదువుచుండ, మనోహరారణ్యముల సంచరించినట్లను శకుంతల పూఁదీవలకు నీరుపోయుచుండ నేను ప్రత్యక్షముగ జూచినట్లును, ఆమె నత్తవారింటికి వీడ్కొలుపుటకు నీటి కాలువవఱకు వచ్చిన కణ్వమహర్షి యు ననసూయా ప్రియం