పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

51


నప్పుడు కవి కేవలము సమష్టివర్ణనముతో సంతుష్టి పడి యుండరాదు,

ఏవిహంగముగన్న నెలుఁగించుచును సారెకునుసైకతంబులఁ గూడఁదారుఁ దారి కన్గొని యది తనజోడుగాకున్న మెడయెత్తి కలయంగ మింటినరయు నరసి కన్నీటితో మరలి తామరయెక్కి వదన మెండగ సరోవారి నద్దు నద్ది త్రాపఁగసైఁప కట్టిట్టు కన్గొని ప్రతిబింబ మీక్షించి బ్రమసియుఱుకు

నుఱికి యెఱకలు దడియ వేఱొక్క తమ్మి
కరుగు నరిగి రవంబుతోఁ దిరుతేంట్లఁ
బొడుచు ముక్కున మఱియును బోవువెదక
నంజఁ బ్రియుఁబాసి వగ నొక్కచక్రవాకి,

(మనుచరిత్ర)

}}

పై పద్యమున విరహచంచలయైన యొక చక్రవాకి చర్యలు వర్ణింపబడినవి. కవి యెచ్చోటనైనను 'ఆ చర్యలు మనోహరములుగ నున్నవి' అని చెప్పలేదు. ఎందువలన ? అవసరములేదు. ఆ చక్రవాకి చర్యలు. మన భావమునకుఁ దట్టిన వెంటనే అవి హృద్వములుగ నున్నవని మనమే యెఱుంగుదుము కార్యకారణములను రెంటినిఁ జెప్పుట రచనా కౌశలమునకు లోపము. ఒకటి తెలిసిన మఱియొకటి తప్పక తెలియఁగలదు, కళానియమబద్ధుఁడై కవి వదలి పెట్టిన వివరములను పాఠకుఁడు తన సొంత భావముతో బూరించు కొనవలయును. కావుననె, పాఠకులు సహృదయులుగ నుండ వలయుననుట.

___________