పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

48

కవికోకిల గ్రంథావళి

ఇంతింతై వటు డింతయై మఱియుఁ దానింతై నభోవీథిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్థియై.

ఈ పద్యమందు అనుక్షణ వర్ధమానమైన వామనుని స్వరూపము వర్ణితమైయున్నది. ఈ విషయమును స్ఫురింపఁ జేయుటకుఁ జిత్రకారుని కన్నను కవికి ఆనుకూల్య మెక్కువ. ఏ నిమిషమున జరుగుచున్న కార్యము (విజృంభణము) చిత్రించినయెడల ముందుజరిగిన విషయమును ఇఁకముందు జరుగఁబోవు విషయమును సూచితమగునో అట్టి చర్యను మాత్రము చిత్రకారుఁడు చిత్రింపవలయును. చిత్రమును మ్యాజికు లాందరు బొమ్మకును, కవిత్వమును బయస్కోపు బొమ్మలకును బోల్చవచ్చును.

చిత్రకారుఁ డొకరమణీయ రూపమును లిఖంచి మనలను నానంద పరవశులను జేయును. మనకానంద మెట్లు కలిగినది? ఆరూపముయొక్క సర్వావయవములు సమష్టి యాకారమున కనురూపముగను, రమ్యముగను చిత్రింపఁబడియుండును. అవి యెల్లను సమష్టిగా నొకేసమయమున గోచరించును. అప్పుడా రూపసౌందర్యమును మెచ్చుకొనుట వలన ఆనందము మనకుఁ గలుగును. కవియు నొక సౌందర్యవతిని వర్ణింపవలయునన్న నేమి చేయవలయును? చిత్రకారునివలెఁ బ్రత్యంగముఁ దాను వివరముగ వర్ణించి అట్టి యానందమును మనకుఁ గలిగింపఁ గలఁడా! ఎన్నటికిఁ గలిగింపలేఁడు. ఎందువలన? కవి యొక్కొక్కయవయవమును