పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

46

కవికోకిల గ్రంథావళి


ఆకారము మన సమష్టి దృష్టికి నందక మించిపోవునంత పెద్దదైన యెడల దానిని మెచ్చుకొనఁజాలము .

సౌందర్యమున కేదోయొక లక్షణమును గల్పించి దానిని బందిఖానాలో వేయుటకంటె స్వేచ్ఛగ వదలుట మేలు. ప్రతి మానవుని బుద్ది నిర్ణయమె సౌందర్యమునకు బ్రమాణము.. అది ప్రత్యేకము. సామాన్య వస్తువులలోఁ గూడ ననంత సౌందర్యమును దర్శించిన మహాను భావు లెందరోగలరు.

"In all poor foolish things that live a day
 Eternal beauty wandering on her way"

అని సుప్రసిద్ధ ఐరిషు కవి ఈట్సు గానము చేసి యున్నాఁడు.

___________

7. శిల్పసీమలు

లలితకళలన్నియు, నొకే మూలసూత్రమునకు బద్దములై యును, ఒకే యంత్య ప్రయోజనము గలవైయును వాహక భేదముల ననుసరించి వానివాని యధికార సీమలును భిన్నములుగ నుండును. కళలన్ని యు నొకే విధమైన శక్తి పరిమితులు గలిగియున్న యెడల, గానము, కవిత్వము, చిత్రలేఖనము, భాస్కర్యము మున్నగునవి పృథగ్భావము భజింప నవసరముండదు ఒక్కొక కళయందు నితరకళలలో లేని యానుకూల్యమును గుణమును హెచ్చుగ నుండుటచేతఁ గళలన్నియు మనకు నావశ్యకము లైనవి. '