పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

37


స్త్రీ సౌందర్య పరమావధిని మూర్తిభవింపఁజేయవలయునని ఆతని యుద్దేశము. తాను రచియించిన రూపముకన్న రమణీయవతి యగు మఱొక కాంత గాన్పించిన యెడల చిత్రకారుఁడు పూర్వచిత్రమును జించి పాఱవైచి, క్రొత్తరచనకుఁ బూనుకొనవలయును ప్రకృతి పరిణామ శీలము; రూపములను సృజించుచుఁ 'బోవుచుండును. స్త్రీసౌందర్య పరమాదర్శమును సృజించుటకుఁ బ్రకృతి యెన్ని నమూనాలను వ్రాసి చింపివేయవలయునో, యెన్ని వేల సంవత్సరములు పట్టునో యెవరి 'కెఱుక? నిఫుణుఁడైన చిత్రకారుఁడు స్వయముగ సౌందర్యమును ధ్యానించి తదనుసరణముగ లిఖించిన చిత్రము చిరంజీవముగ నుండగలదు. శకుంతలాది యద్భుతసృష్టు లీ తెగకుఁ జేరినవే.

___________

6.. రస రామణీయకములు

'విభా వానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి! అని భరతముని రసలక్షణము నిర్వచించెను. అప్పటి నుండియు రసస్వరూప విచార చర్చ నిరంతరముగఁ జరుగుచు వచ్చినది వ్యాఖ్యాతలును ఆలంకారికులును వారివారికిఁ దోఁచినట్లు భిన్న భిన్నముగ భరతసూత్రమును వివరింపుచు వచ్చిరి. సూత్రమునకు అనుకూలమును బ్రతికూలము నగు నెన్నియో మతములు బయలు దేరినవి* [1] కాని వాని నెల్ల

  1. *మతభేదముల వివరములను, వాద ప్రతివాదములను దెలిసికొనఁ గోరువారు కావ్యప్రకాశికను, రసగంగాధరమును జదువవలయును.