పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/280

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

274

కవికోకిల గ్రంథావళి


గట్టుకొన్న రసలుబ్ధుఁడె Tragic, conversion, అను ఇంగ్లీషు ముక్కలు వేయనిదే తన అభిప్రాయము వెల్లడింప లేని యపుడు ఇంగ్లీషు జాతీయము లేక యే వాక్యము రచింపలేని యపుడు ఇఁక ఇంగ్లీషు తెలుఁగులు నేర్చుకొన్న వారి విషయము వేఱుగఁ జెప్పవలయునా ! ఇంగ్లీషుభాష వ్యాపించి యున్న యీకాలమున నెందైన నొకచోట ఇంగ్లీషు జాతీయములు దొరలుటలో ఆశ్చర్యమేమియు లేదు. ఇంగ్లీషు జాతీయములు తెలుఁగు రూపముతో వాఙ్మయమునఁ బ్రవేశించినపుడు అవి రమణీయములుగ నుండునేని అంగీకరించిన తప్పేమి? ఒప్పేయగును. ఇట్టి మార్పులు మనభాషలో నెన్ని జరిగియుండ లేదు? గుంటచిక్కుల సంస్కృతాన్వయము ధాటికే నాశనముగాని తెలుఁగుభాష ఇంగ్లీషు జాతీయములు కొన్ని చేరినంతనే చెడిపోవునా !

__________


Printed at the Weldun Press, Madras-21