పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

273

(15) తానెప్పుడో విన్న యుపశ్రుతి మరణసమయమున ఏల కుంభునకు జ్ఞప్తికి రావలయును ? అట్లగునేని జ్ఞప్తికి రాఁదగినవికూడ చాలగలవు; నాటకములోని పాతిక భాగము పునరభినీతము కావలసియుండును! తన జీవితమును సింహావలోకనముగఁ జూచుకొన్న ఘట్టము ముందే దాఁటి పోయినది, ఈ మరణ సమయమునఁ దనమనము నాక్రమించు కొనఁదగిన భావములేవి ? తన భ్రాంతి, మీరా మరణము, తన మరణము, వీనిని గుఱించిన తలపోఁతలేగదా సహజములును, సమంజసములును,

(16) మీరా పాటను గుఱించి యొకమాఱైన కుంభుఁడు ప్రస్తావము చేయలేదఁట ! ఇది యొక యసంభవమఁట ! ప్రసక్తి లేనియపుడు ప్రస్తావ మెట్లువచ్చును-- మీరా పాట కుంభునకుఁ గ్రొత్తదికాదు; లోకమునకు వింతగ నుండవచ్చును.

(17) ఇందలి యితివృత్తము సంప్రదాయాగతమై లోకమున వ్యాపించియున్నదనియుఁ జారిత్రకము కాదనియు ముందే తెలిపియున్నాను.

రసలుబ్ధుఁడు నాటక భాషను గుఱించియు నిట్లు విమర్శించెను: “మీరా నాటక భాషయందు ఉత్తమ మధ్యమ పాత్రలకిడిన యాంధ్రమందె ఇంగ్లీషు జాతీయము, వ్యాకృతా భాసము గ్రామ్యమును అందందుఁ జెవింబడుచుండెను. ఎన్ని వాక్యములో యింగ్లీషున కనువాదములు గాని తెలుగు జాతివి కావని తోఁచుచుండెను” శుద్ధ శ్రోత్రియుఁడై మడి