పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

269

(5) ఇచ్చట రసలుబ్ధుని సందేహము సహేతుకము. మీరా మరణవార్తను అగ్బరుచే నొకమాటలో చెప్పించి యున్న ఈ సందేహమునకుఁ దావుండదు,

(6) తన యాజ్ఞను నిర్వర్తించునను నమ్మకముచేతనే రాణా మీరాను ఆజ్ఞాపించెను. ఆమె తిరస్కృతియుఁ గానరాదు. రెండవతూరి కుమారుఁడు అగ్బరు ఉదంతము చెప్పవచ్చినపుడు మీరా యమునామార్గమునఁ జనుచుండెనని చెప్పెను రాణా సేవక వర్జితుఁడయ్యును ఆజ్ఞాపింపఁగల స్థితిలోనేకదా యున్నాఁడు. మీరా తన యాజ్ఞను తృణీకరించిన అప్పటి యతని నిర్ణయ మెట్లుండునో మన మెట్లూహింపఁ గలము?

(7) కుమార సింహుఁడు ముందు బయలుదేరెను; అగ్బరు తాన్ సేనులున్న స్థలమున వెదకెను. వారచ్చటలేరు. అతఁడు వారిని వెదకుచుండెను. కుంభరాణా అతనికన్న అయిదు ( లేక) పది నిమిషములకు వెనుక బయలుదేరెను. అడ్డదారిబట్టి కుమారునికన్న ముందు ఆ స్థలమునకుఁ బోయి వెదకుచుండెను. వెనుక వచ్చు కుమారసింహునికి ముందుఁ బోవు రాణా యగపడుటయెట్లు అసంభవము? కుమారుఁడు “తండ్రీ, నీ వేల యింతలో నిచ్చటికి వచ్చితివి?” అనెను. తాను వచ్చుటకు ముందుగ నే యెట్లు వచ్చితివను భావమె గదా ఆ వాక్యమున ధ్వనితమగుచున్నది.

(8) కుమారుఁడు తన్నుఁదాను పొడుచుకొనెను; పొడుచుకొన్నట్లు నటించి రాణాచేఁ బొగడించుకొనుటకుఁ గాదు; దుఃఖభారమును సహింపలేకయే, పొడుచుకొనెను.