పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/274

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

268

కవికోకిల గ్రంథావళి


టకుగాఁ బంపలేదు ; మీరాను అనుసరించుటకు బంపెను. చంపుటకుఁ దనకు ఆజ్ఞ లేదుగావున రాణాయొద్దకు వచ్చెను. రసలుబ్ధుఁడు తలఁచినట్లు “చంపుమన్న యాజ్ఞను ” దాను దాఁటలేదు. ఆ యజ్ఞ రెండవతూరిది.

(3) రసలుబ్ధుఁడు తనసంచిలోని “రేడియం కాటుక "ను దాను కన్నులకుఁ జరుముకొన్నట్లు తోఁపదు. అట్లయిన అప్పటి పరిస్థితులు చక్కగ గోచరించియుండును. ఆసమయమున మంత్రులును ఇతర సేవకులును బెడిసిపోయి యుండిరి. కుమార సింహుఁడొక్కఁడే "రాణాకుఁ బట్టుఁగొమ్మ. కావున వానినే పంపెను ఇదంతయు రాత్రికాలమున రాజప్రాసాదమున జరిగెను. బెడిసిపోయిన మంత్రులకును దండనాథునకును ఈసంగతి యెట్లు తెలిసి రాణాకు సహాయపడుదురు? రాణా సొంతముగ వారి సహాయ్యముకోరునా? అగ్బరు సిబ్బందితో రాలేదని రాణా యెఱుంగును. అట్లు వచ్చియుండిన వేగుల వారు తెలిసికోక యుందురా? తలారి చెప్పినపుడుగూడ ఇద్దఱు బాటసారులనియేగదా చెప్పెను. అగ్బరును జంపుటకు ఒక్క రసపుత్రుని బంపుట తప్పఁట! పద్మినీ సందర్శనమునకై వచ్చిన యల్లాయుద్దీనుని ముప్పదివేల సైన్యమును ఏడు వందలమంది రసపుత్రవీరులేగ దా చించి చెండాడినది.

(4) సంభవమే. ఏలయన అగ్బరు మరణము రాజునకుఁ బ్రియము--ఆజ్ఞాతృణీకరణాపరాధమువలనఁ గలుగు నప్రియముకంటె ఈ వృత్తాంతము నెఱింగించుటవలన గలుగు ప్రియము హెచ్చుగా నుండునని తలఁచి కుమారుఁడు రాణా యొద్దకి పరుగెత్తెను.