పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

267


కాశముండి యుండదు; వ్యాసమును ఇంతనిడివియై యుండదు, తన ప్రశ్నలకుఁ బాలవఱకు నాటకమునందె ప్రత్యుత్తరము లున్నవి. అసంభవముల విచారించునపుడు రసలుబ్ధుని సంఖ్యా క్రమమునే అనుసరించెదను.

(1) ప్రబల శత్రువైన కుంభరాణా రాజ్యమునఁ దాను బ్రవేశించుట సాహసకార్యమని అగ్బరెఱుంగును; అయినను మీరా సందర్శనము అవశ్యకర్తవ్యమని తలఁచెను, ఇందువలన అగ్బరుని సాహసికత్వము (Adventurous spirit) మనకు గోచరించును. రహస్యముగఁ బరదేశమును బ్రవేశించువారు రాజులయ్యును మందుగుండు సామగ్రి వెంటఁ బెట్టుకొని పట్టపు టేనుఁగునెక్కి రారుగదా! అగ్బరు, విరోధి రాష్ట్రమున నిస్సహాయుఁడై కాలువెట్టఁడు అను ప్రజల నమ్మకమె వానికి రక్షక కవచమైనది. యూరపుదేశమున జరిగిన మహా సంగ్రామమున కైజరు పుత్రులలో నొకఁడు మాఱువేసమున, సీన్ నదిప్రక్క విడిసిన ఫ్రెంచి పటాలపు బిడారునఁ బ్రవేశించి కావించిన యద్భుత సాహసకార్యములు చదివిన అవి సత్యములా లేక కల్పితములా యను సందేహమునకుఁ బాల్పడుదుము.

అగ్బరు వజ్రహారమును గురుకట్నముగసమర్పించెను. తానట్లుచేయుట పొరపాటని వెనుక చింతించెను. ఇట్టి పొరపాటులుపడు మనుష్యులొక చోటఁ జేరినప్పుడే ట్రాజెడీ కలుగును.

(2) ఇచ్చట రసలుబ్ధుఁడు పొరపడినాఁడు, రాణా కుమారసింహుని మొదటితూరి పంపినపుడు అగ్బరును చంపు