పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

21

కవిత్వము' అని ఆయన తెలిపియున్నాఁడు, ఈ లక్షణము. ప్రాచ్చపాశ్చాత్యులకుఁ బరమసమ్మతమైనదిగ నుండ వచ్చును.

కవిత్వప్రభవమును దెలిసికొన్నఁ గొంతవఱకు కవిత్వ స్వభావమునుగూడ మన మూహింపవచ్చును. సహజమైన ప్రతిభయె కవిత్వమునకుఁ గాకరణము. ఇతరములు సంస్కారములు. అవి కవిత్వమునకు వన్నె దెచ్చును. [1]నవనవోన్మేషణ శాలినియగు ప్రజ్ఞయె ప్రతిభ యని భామహుఁడు నుడివి యున్నాఁడు. ఇట్టి శక్తి కవియందు లేనియెడల నాతని రచన లన్నియు నిర్జీవములుగ నుండును. అట్లయిన కవికి పాండిత్య మక్కఱలేదా? కవుల పాండిత్వమునకును పండితుల పాండిత్యమునకును జాలభేదమున్నది. కవుల పాండిత్యము సహజమయి ప్రతిభాంత ర్భూతమయి యుండును. పండితుల పాండిత్యము విశేషగ్రంథపఠనము వలనను శిక్షవలనను నలవడు విషయజ్ఞానము.

కవి యందఱివలె నూరకుండక రమ్యమైన భావప్రపంచము నేల సృజింపవలయును? ఇది కవియొక్క యాంతరంగిక ప్రేరణము; శమనాతీతమైన సౌందర్యపిపాస; అనివార్యమైన రసావేశము! భావోన్మాదము; కవి హృదయైక వేద్యము. 'తుమ్మువచ్చినను నవ్వు వచ్చినను పట్టరాదు' అనెడి సామెత యొకటికలదు. కవి ఆవేశముగూడ నిట్టిదియె. మనోహరమైన


  1. "ప్రతిభా అపూర్వ వస్తునిర్మాణక్షమా ప్రజ్ఞా; తస్యా విశేషో రసావేశ వైశద్య సౌందర్య కావ్యనిర్మాణ క్షమత్వం. లోచనవ్యాఖ్య —ఆభినవ గుప్త పాదాచార్యులు