పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/269

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

263


ప్రాయములను సరకుగొనఁడు “న్యాయమని తోఁచినయెడలఁ బ్రపంచమునకుఁ బ్రతిస్పర్దిగనైన నిలువగలను” అని గర్జించును. ఇట్టి మూర్తిని మనము భావించుకొనఁ గలుగుదుమేని "passion rising to tragic grandness" అనువరనమునకు నుదాహరణప్రాయముగా నుండదా? మనసులో నిట్టి విప్లవము. చెల రేఁగుచుండఁగాఁ రాణా "పదరక” యోచించుటకు అతఁడేమి జీవన్ముక్తి కి యత్నించుచున్న యోగియా !

"ప్రహ్లాద భృగుపతన గరళ పానాదులంబోలె నే సౌజన్యము ఇట్లు పీడింపఁబడు చున్నదను జాలి కలుగక దౌర్జన్యము ఎట్లు భంగపడునో చూతము అను కుతూహలము వినోదము కలుగుచుండును. ఇదే అతిమానుష సంభావమునకు ఫలము! ఇందేమి ట్రాజెడి !...... రాత్రి పడుకింట ఏకాంతమున కంఠమున తదాలింగనము ఎదురు సూచుచున్నట్టిది, అకాండముగ ఆకంఠమె ఆ చేతనే నులుమంబడి చచ్చుట! అదిట్రాజెడి!" అనిరసలుబ్దుఁడు డెస్ డెమోనా బాయిని స్మరించినాఁడు! మీరాబాయిపాత్రపోషణమునందు అమానుషత్వము లేదు. ఆమె పరమభక్తురాలు; కృష్ణధ్యాన పరాయణ; గాన కుశల, అయినను అట్లుండుట యమానుషముగాదు. ఆమె మహిమలు (miracles) చూపింపలేదు. ప్రహ్లాదుఁడు ఏనుఁగులచేఁ ద్రొక్కింపఁబడియు, గొండచరులనుండి క్రిందికిఁద్రోయ బడియు, విషమిప్పింపఁబడియుఁ జావలేదు. ఇదిగదాయమానుషత్వము! మీరాబాయి ప్రహ్లాదునివలె మత్యువును జయింప లేదు. ఆమెయందు మానవ సహజములగు కొన్ని లోపములును గలవు. అవి యింతకు ముందే ప్రస్తావింపఁ బడినవి.