పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/264

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

258

కవికోకిల గ్రంథావళి


IV

“ఆ మీరాదేవి సౌజన్య సతీత్వములు ఇతర స్త్రీజన విలక్షణములు; పతిదేవత కాకున్నను మీర కృష్ణైక నిరతచిత్త, మీర మహిమ యిల్లుదాటి ఊరుదాటి హిమశైల నలసేతువులందు విశ్రమించినది. . .మీర పాట భూలోక దుర్లభము. . .పతియెడ ఆమె కావించిన యపచారము కానరాదు. అట్టి తేజోమూర్తియందుఁ దొలుత అపరాగ శంకయుఁ దరువాత (కృష్ణగతమునందె) అన్యరాగశంకయు వహించి హిందువు, వివేకి, రాజు, ఉపశ్రుతి కులికినవాఁడు ఆ స్తికుఁడు కానేకాఁడా? ఆమే సర్వముచేతను బవిత్రీకరింపఁబడిన భావముల నడుమ నుండువాఁడయ్యు కుంభుఁడు భ్రాంతిచెంది శర్ష్యపొంది ... దాని నిముడ్చుకొనఁజాలక ... అమాత్యులును బ్రజలును బెడిసిపోగా...మీరను ఆ చావునకు పాత్రీకరించెను. తరువాత ఒక యలంతిపొరచే తానునుం జచ్చెను ఇదేమి ట్రాజెడి! దీన నేమి యుపదేశము? నాస్తిక పితయు ఆస్తిక పుత్రుఁడు హిరణ్య ప్రహ్లాదులు. . .మఱి పతియు పత్నియు మీరా కుంభులు... ప్రజామాత్య కింకరాది సర్వ జనాంగీకారానంగీ కారములు వినంబడుచు పదరనీక విమర్శకు , ఎడ మిచ్చుచునే యుండగా అట్లు చంపను చావను అంత అననురూపులా? అసంభావ్య వస్తువు చిత్తమున కెక్కదు.” అని రసలుబ్దుని వాదధోరణి. దీని నుండి కొన్ని సిద్ధాంతములు ప్రశ్నలు విడఁదీయవచ్చును.

మీరా భక్తురాలు; కృష్ణధ్యానపరాయణ, రాజు హిందువు, వివేకి; (ఇంతకుముందు జాల్ముఁడని నిందించియుం