పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

20

కవికోకిల గ్రంథావళి

టయె కవిత్వమని వర్డ్సువర్తును, షెల్లీయు (Wordsworth, Shelley) అభిప్రాయపడిరి. కాని, యీ లక్షణము సందిగ్ధముగ నున్నది. భావోత్కర్ష తను బ్రకటించుటయంతయు కవిత్వ మగునా? ఇదియె యధార్ధమైనయెడలఁ గోపోద్రిక్తుడైఁ తిట్టెడి వాని మాటలను, సభ్యుల హృదయము చెలరేఁగునటుల నేదోయొక రాజకీయ విషయమును గుఱించి యుపన్యసించు. నాయకుని వాక్యములును కవిత్వము కావలసివచ్చును. కేవలము భావప్రకటనము కవిత్వముకానేరదు.

కార్లయిల్ పండితుఁడు (Carlyle) గానాన్వితమైన యాలోచన కవిత్వమని నుడివియున్నాఁడు. ఈ లక్షణము సత్యమునకుఁ గొంచెము సమీపముననున్నది; అయినను పూర్ణసత్యముగాదు. కార్లయిలు పండితుఁడు గానాన్వితమైన యాలోచన యనుటలో కావ్యమునందు భావములకును శిల్పమునకునుగల సంబంధము నించుక సూచించెను. ఇంతకంటెను లే హంటుగారి (Leigh Hunt) నిర్వచనము మఱికొంత సత్యసమీపవర్తిగనున్నది. ఆయన కవిత్వమునకు సత్యసౌందర్యముల స్పర్శను గలిగించెను కానీ, యమెరికా దేశపుఁ బ్రఖ్యాత కవియగు ఆలన్ పో (Allan Poe) గారి నిర్వచనమునందు కవిత్వ లక్షణము పరిపూర్ణత నొందినది. ఆలన్ పో గారిని అమెరికాదేశపు పండితరాయలని చెప్ప వచ్చును. 'రామణీయకమును లయారూపమున సృజించుటయె