పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

253


“ఉపపత్త్యుపన్యాసపూర్వకముగ వాగారంభముం బొరయించు” వాఁడయ్యు నేకారణముం జూపక యిట నిట్లు వాగారంభముం బొరయించుటఁ దనతర్కమునందే తనకుఁ బ్రత్యయము చాలమిని సూచించుచున్నది.

రాణా హేతువాది. (Rationalist) గా నగపడు చున్నాఁడు. అతని యభిప్రాయములు కొన్ని హిందూమత విరుద్ధములు. ఆతనికి స్వర్గనరకములయందు నమ్మకములేదు. ప్రజలను భయపెట్టి ధర్మమాచరింపఁ జేయుట కొఱకును, బరలోక సుఖముపై నాసపెట్టుకొని యిహలోక కష్టములను సహించియుండుటకును, నరకము స్వర్గము పౌరాణికులు సృజించిన గాలి మేడలని ఆతని నమ్మకము. ఊహమాత్రమైన పాలసముద్రమునునమ్మి చేతిలోని పాయసపుఁ బాత్ర జాఱవిడువఁడు. యౌవన సౌందర్యము లెట్లు కాలబద్దములో మానవుని భోగాభిలాషకూడ నట్లె యనియు ఆకామ్యాను రాగమె అనుభుక్తమయి వార్ధక్యమునందుఁ దప్తకాంచనము వలె నిష్కల్మషమయి బహుకాల సహవాస జనిత బాంధవ్యముగ మాఱుననియుఁ దలంచుకొని సామాన్యగృహస్థ ధర్మములను కుంభుఁడు ఆచరించుచుండెను. కపటగురువులు లోకమును మోసగించు చున్నారనియు, వారి పలుకుబడి సన్నగిల్లిననేగాని లోకులకు మూఢభక్తి నశింపదనియు నాతఁడు తలంచెను. లోకాతీత ధర్శములు కుక్కమూతి పిందియలని యాతని భావము. వైదిక మతమునకు విరుద్దములైన మతములు లేవదీసిన ఆచార్యులందఱు అవివేకులు కారు, అవి వారి మత విశ్వాసములు?