పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/258

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

252

కవికోకిల గ్రంథావళి


యొక యింగ్లీషు విమర్శకుఁడు షేక్‌స్పియరు ట్రాజెడీలలోని నాయికా నాయకులను గుఱించి యిట్లు చెప్పెను :

IIamlet, the “religious" and the lover, doomed to set the world aright; Othello, stupid and nnintellectual fiery in his passions, set opposite to Iago, lago, unscrupulous and clever; literally tempted by Othello's imbecility; Lear conceited and proud, unobservant and credulous, faced by big evil daughters apd Cordelia; Macbeth, emotional and weak, yet ambitious, met by the witches, and goaded on by his wife; Lady Macbeth hard and self seekiny, confronted by temptation; Coriolanus over weening in his pride condemned to stoop to plebians; Antony, amorous and doting met by Cleopatra; all of these are placed in the exact situation which they are incapable of mastering"

నాయికా నాయకులలోని యిట్టి గుణలోపములవలననే ట్రాజెడి సంభవించును.

‘‘మఱియు యీ చావు నాటకముల మార్గమున మీరా నరయుదు మేని” అని రసలుబ్దుని వ్యంగ్యచమత్కారము ! "కుంభుని యుదాత్తత తటాలున ఉపస్థితము కాదు. నిపుణముగ చూచినను కాదు. ఎంత గొప్పవాఁడురా అని సూక్ష్మమైనను సూటియైన సూచన వినంబడదు. అభిమాని, విషయలోలుఁడు, ఉద్దతుఁడు, మొండికట్టె, జాల్ముఁడు, అని గ్రహింపఁబడుచుండును. ఎంత పదోచ్ఛ్రితుఁడో అంత గుణోచ్ఛ్రితుఁడు. చిత్తమునం బాదుకొనని వాని పతనము ఏపాటి యుపదేశపటువు?” అని దోషారోపణము, ఈ రసలుబ్ధుఁడు