పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

251


ముఖ్యముగ వర్తించును. తనకుగలుగు దురవస్థ ఆకస్మికముగ వచ్చును, కాని అందులోఁ దనకును గొంత బాధ్యతగలదు, నాయకునికి గలుగు కష్టపరంపర వాని చేష్టలనుబట్టి అని వార్యముగను, ఒక్కొక్కపుడు విధి ప్రేరితమైనట్టును స్పురించును. ఉఱ్ఱూఁతలూఁచు సుడిగాలిలో గిరికీలుగొట్టు ఎండుటాకువలెఁ, దన్నేశక్తి ఆకర్షించుచున్నదో కనుఁగొన లేక , మనస్సులోని భావోద్వేగమును, బయట సంఘటనముల యుద్వేగమును ఏకమై ప్రవహింప, అందు చుక్కాని లేని నావికునివలె నాయకుఁడు పయనించి యెట్టకేలకు దుర్మరణము నొందును.

నాయకుఁడు తాను జేయుపని దుష్టమని విశ్వసించెనేని న్యాయమార్గ మవలంబించినట్లు నటింపఁడు; తాను పొరపాటుపడినను, దానిని పొరపాటని తెలిసికొనఁజాలక , న్యాయముకొఱకు, ధర్మముకొఱకుఁ బాటుపడుచున్నా నను దృఢవిశ్వాసముతో దురవస్థకుఁ బాల్పడును. కావుననే మనకు జూలిగలుగును. ఒ కేదృష్టియందుఁ బక్షపాతము, ఒకే మార్గమునందుఁ బట్టుదలయు నతనికి సహజము. ఇందేదియుఁ గార్యకారణ సంబంధమునకు వెలియై యుండదు. నాయకునకు సంభవించు కష్టములు దైవదత్తములుగావు; మానవచేష్టా జనితములు. నాయకుని యధఃపతనము, అతని దుషత్యము వలన కలుగునది కాదు; పొరపాటువలననో తొందరపాటు వలననో కలుగును. గొప్ప గుణములతోఁ బాటు అజగరూకతయు, కొన్నిటియందు అజ్ఞానమును, గర్వమును, ఉద్రిక్త భావమును, సంశయమును ఈ నాయకున కుండును. కావుననే