పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

245


హిందూదేశ చరిత్రాంశములను బోధించుటకు కవి యీ యితివృత్తయును గ్రహించి యుండఁడు; తాను రూపింపఁదలఁచుకొన్న భావస్పర్ధకు ఈ యితివృత్తము అనుకూలముగ నుండునని యూహించి దీనిని గ్రహించి యుండును. పాత్రపోషణ, సరణికూడ చారిత్రకముగాదు. అగ్బరు ఒకక్రొత్త మతమును స్థాపించిన వాఁడయ్యు ఈ నాటకమునఁ జూపఁబడినంత భక్తితత్పరుఁడు కాఁడు. రాణా అంత హేతువాదియుఁ గాఁడు. కథ చారిత్రకము కానియపుడు పాత్ర పోషణము చరిత్ర సమ్మతమా కాదా యను విచారముతో మనకుఁ బనిలేదు. ఈ నాటకమున నాయికా నాయకుల పాత్రపోషణము 'ట్రాజెడి' లక్షణములకు సరిపోవునా లేదా యను విషయమే ప్రస్తుతము విచారింపవలసిన యంశము. ట్రాజెడీ తత్త్వనిరూపణము దేశకాల పాత్రాను గుణముగ మాఱుచుండెను. గ్రీకు ట్రాజెడీలనుండి అరిస్టాటలు సమకూర్చిన లక్షణములె చాల కాలమువఱకు అనురింపఁబడు చుండినవి. స్థూలముగ, ఈ ట్రాజెడీలను గ్రీకులవి, ఎలిజెబెతు కాలము నాటివి, ఆధునికులవి, అని మూడు వర్గములుగ విభజింపవచ్చును. గ్రీకు ట్రాజెడీయందు హాస్యజనకములగు సంభాషణము లుండకూడదు. వస్తువు కాలస్థల క్రియైక్యములను బొంది యుండవలయును. ఒక్క దినమున జరుగఁ గలవిషయమె నాటక నిబద్దము కావలయును. కాలము చెల్లుకొలఁది ట్రాజెడీ రచనయందు కొన్ని మార్పులు అజ్ఞాతముగను, అనివార్యముగను గలుగు