పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

244

కవికోకిల గ్రంథావళి


produces it again not on account of mere historical truth, but, for a totally different and a nobler aim. Historical accuracy is not his aim, but only the means by which he hopes to attain his aim, he wishes to delude us and touch our hearts throngh this delusion." G. E, Lessings

మీరాబాయి నాటకములోని మీరా కుంభరాణా అగ్బరు తాన్‌సేనులు చరిత్రకు సంబంధించిన వారయ్యు కథమాత్రము చారిత్రకము కాదు. అగ్బరును కుంభరాణాయు సమకాలికులు గారు. రాణా క్రీస్తువెనుక 1419 మొదలు 1469వ సంవత్సరము వఱకును, అగ్బరు 1516 మొదలు 1605వ సంవత్సరము వఱకును రాజ్యమేలిరి. రాణా సింహాసన మధిష్ఠించిన 137 సంవత్సరములకు అగ్బరు పట్టము గట్టు కొనెను;, కాని, సంప్రదాయానుగతముగ లోకమున వ్యాపించియున్న కథయందు మీరా అగ్బరులకు సంబంధము కల్పింప బడియున్నది. మీరా కథ మూడు నాలుగు విధములుగ గ్రంథస్థమై యున్నది. ఒక కథకును మఱియొక కథకును భేదములున్నవి, అచ్చమాంబగారి "అబలా సచ్చరిత్ర రత్నమాల” యందును “మీరా గీతావళి” అను హిందీ గ్రంథమునందును, “భక్తవిజయము" నందును మీరా కథ గలదు “ రాజస్థాన కథావళి " యందు రాణా చరిత్ర కనఁబడు చున్నదేగాని మీరావిషయమై అందుఁ గానఁబడదు. కాలము మీరా కథకుఁ గొంత 'పౌరాణిక స్పర్శ' కలిగించినది; యథార్థ చరిత్రము పురాణ గాథలలో లీనమైనది.