పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

19

ములను నాయికానాయక సంబంధమపేక్షింపక , తన యాంతరంగిక ప్రేరణమువలన రచియించిన యుద్యాన విషయాది వర్ణనములకు ఉద్దీపనత్వము సిద్ధింపదుగాన, వానిని నీరసము లనియె నిర్ణయింపవలయును. ఇదియొక సందిగ్ధ విషయము. ఇప్పుడు మనము విశ్వనాథుని లక్షణము నంగీకరింపవలసి యున్న, సంకుచితమైన రసలక్షణమును మఱింత విరివి చేసి, యుద్యానాది పర్ణనములకు గతి కల్పింపవలయును. లేక, పూర్వికుల రసలక్షణ మంగీకరింతుమేని విశ్వనాథుని కావ్య లక్షణమును సంకుచితమైనదని తలంపవలయును.

సాహిత్య దర్పణకారుని కన్నను, నర్వాచీనుఁడైన పండితరాయలు 'రమణీయార్థప్రతిపాదక శబ్దః కావ్యం' అని రామణీయకమునకుఁ బ్రాధాన్య మొసఁగినందువలన కవితా నర్తకి నాట్యరంగము విశాలమైనది. కావ్యమున మనము చూడ వలసినది చిత్తాకర్షకమగు రామణీయకము. అట్టిగుణ మేకావ్యమునందుఁ బూర్ణముగ నుండునో నదియెల్ల సాధువును, ఉత్తమము నగును.

పాశ్చాత్య లాక్షణికులును, కవులును కవిత్వ లక్షణములను వచియించియున్నారు. [1]భావోత్కర్షతను వెలిపుచ్చు


  1. (1) Poetry is the spontaneous outflow of powerful feelings. It takes its origin from emotion recollected in tranquility. - Wordsworth.
    (2) Poetry we will call Musical Thought.. - Carlyle.
    (3) Poetry may be defined as the expression of the imagination. - Shelley.
    (4) (Poetry is) the utterence of a passion for truth, beauty; and power, embodying and illustrating its conceptions by imagination and fancy and modulating its Language on the principal of variety in unity. -Leigh Hunt.
    (5) Poetry is the rhythmic creation of beauty. - Allan Poe.