పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

242

కవికోకిల గ్రంథావళి


తాను రచించిన 'వనకుమారి', 'కడపటి వీడుకోలు' అను కావ్యములందును ఇట్టి 'రసాభాస' సంవిధానములను చేకూర్చి యున్నాఁడు. కవి మీరాబాయి నాటకమున శృంగారరసము పరిపూతిన్ సేయఁదలచుకొన లేదనుట స్పష్టము. రతి ఉభయ నిష్ఠము కానియపుడు చూపట్టు మానము, ద్వేషము, ఈర్ష్య, రోషము, వానిమూలమునఁ గలుగు దురవస్థలు, మనోవిప్లవము కవి రూపింపఁ దలఁచుకొనెను. ఈ తెగకు సంబంధించిన ప్రబంధములు పూర్వమే రచింపఁబడియున్నవి. కీచకవధ, శుకరంభాసంవాదము, సారంగధర చరిత్రము, మను చరిత్రము మొదలయిన ప్రబంధములు ఈ కోటిలోనివె. ద్రౌపదీ కీచకులయందు రతి ఉభయనిష్ఠము కానందువలననే కీచకుఁడు దుర్మరణము పొందెను, చిత్రాంగీ సారంగధరులలోఁగూడ రసము ఉభయనిష్ఠము కానందువలననే సారంగధరునకట్టి పాటు గలిగెను. లాక్షణికుల సిద్ధాంతముల ననుసరించి యిట్టి కావ్యములు, నాటకములు, తగులఁబెట్టఁబడ వలసినవేగదా ! వేయి సాహిత్యదర్పణములనైన బుగ్గిచేయ నోర్తుముగాని, లోకోత్తర రామణీయకము కనులగట్టించు మనుచరిత్రమును మంటవేయఁగలమా?

It is that the artists as such must have no creed;... ...Rules, conventions, theories, principles, inhibitions of way sort not born of his own immediate feeling are no concern of his. They proceed from an inferior part of human nature, being the work of gapers and babblers." _J. W. Yon Goeths