పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

241


నాటకమున ప్రాధాన్యము వహించుటకు ఆటంక మేమి యను విచారము బయలు దేరెను. భవభూతి కరుణము అంగిగా ఉత్తరరామ చరితమును రచించి 'రసేషు కరుణో రసః' అను ఆర్యోక్తికిఁ గారణభూతుఁడాయెను. శాంతరస ప్రధానముగ కృష్ణమిశ్రుఁడు ప్రబోధ చంద్రోదయ నాటకమును రచించెను. పాపము! ఉత్తరరామ చరితము లాక్షణికుల తత్తఱ పెట్టినది. ఇందలి రసము శృంగారము కాదు; వీరము కాదు. ఇఁక ఉత్తరరామచరితము లక్షణ బాహ్యమనవలయును. ఇధెట్లు పొసఁగును ? లోకము అంగీకరించునా? భనభూతి నెట్లయిన లక్షణ బద్దుఁడని తీర్మానించుకొననున్న లక్షణములకే గౌరవము తగ్గునుగదా! అందువలన లాక్షణికులు, ఉత్తరరామచరితమున ప్రధాన రసము కరుణము గాదనియు, అది విప్రలంభ శృంగార మనియు ధర్శవీరమనియుఁ దర్కవాదములు సలిపి కొంత ఆత్మ సంతృప్తివడసిరి. అట్లుగాక, లక్ష్యము. సనుసరించి క్రొత్తలక్షణమును నెలకొలుపుకొని యుండిన భవభూతి స్వాతంత్ర్యమును మనము గౌరవించినవారమైయుందుముగద!

రతి ఉభయనిష్ఠము కానందువలన మీరాబాయి నాటకమున గసాభాసము గలిగినదని రసలుబ్ధుని వాదము. ఈపాటి విషయము కవియు నెఱింగియుండును. కాని, రసా భాస సంవిధానముకూడ ప్రదర్శన యోగ్యమని కవిమతము కాఁబోలు. కావుననే యీకవి “రస" సిద్ధాంతమును త్రోసిపుచ్చి “రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్య”మ్మను పండితరాయల నిర్వచనమునకు ఉదాహరణ ప్రాయముగ,