Jump to content

పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

239


కును గల తారతమ్య మరయుదుమేని కాలక్రమముగ వచ్చు మార్పులను మనము గమనింపఁగలము. తనకుఁ బూర్యము రచింపఁబడిన 'కంసవధ' యందువలెనె భాసుఁడును “ఊరుభంగము' అను రూపకమున వధను 'స్టేజి' పై చూపించెను. కాని తరువాత నాటకములలో అట్టి సంవిధానము వర్ణింపఁ బడినది; ఇట్టి మార్పులు అనేకములు పొడకట్టును. మార్పులు అనివార్యములు, కళలకును మానవ సంఘమునకును సన్నిహిత సంబంధముగలదు. అందుఁ బొడసూపుమార్పులు కళలయందును ప్రతిబింబించుచుండును.

లక్షణ గ్రంథములలోని నియమములను బొల్లువోక అనుసరించిన సంస్కృత కవులు నాటకములెన్ని యిప్పుడు ప్రదర్శన యోగ్యములై యున్నవి ? పూర్వీకుల నియమములను అనుకూలమైనంత వఱకు గ్రహించి, వలయుచోట్ల క్రొత్త లక్షణములఁ దెచ్చుకొని రచియించు నేఁటికవుల నాటకములెన్ని ప్రజారంజకములుగ నుండుటలేదు? లక్షణములు శాసనములు కావు; మార్గదర్శకములు, కాలము గడచుకొలఁది భిన్నమార్గము లేర్పడుచుండును. "భావి పరిణామ మెవ్వరు పలుకఁగలరు?”

నాట్యరంగ పరికరములయందు ఇప్పటికిని అప్పటికిని ఎంతయో తారతమ్యముగలదు. ఈ భేదము నాటకరచన యందును జూపట్టదా? నాయకుఁడు ఏ స్థలమున సంచరించు చుండునో ఆస్థలమును స్ఫురింపఁ జేయఁగల ఆ లేఖ్యపటములు పరదాలు లేని యాకాలమున నటకులు వర్ణింపవలసిన అంశములు మెండుగ నుండును. కావుననే కార్యసంచలన