పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

కవికోకిల గ్రంథావళి


కొంతకాలము గడచునప్పటికి వివిధములగు రూపకము లేర్పడును. మొట్టమొదట రచియించువారికి మార్గదర్శకముగ లక్షణ గ్రంథము లుండనేరవుగదా! అందువలననే వివిధత్వమునకు అవకాశముండును. తరువాత కొన్ని నూఱుల సంవత్సరములకు (అనఁగా నిర్మాణయుగము దాఁటిన వెనుక) లాక్షణికులు తమకుఁ బూర్యము రచియింపఁబడియున్న రూపకములను బరిశీలించి నిర్మాణపద్ధతి, ఇతివృత్తము, నాయికానాయుకులు, రసము మున్నగువాని యందలి భేదముల ననుసరించి రూపకములను గొన్ని వర్గములుగ విభజింతురు. లక్షణ గ్రంథములు వ్యాపించిన క్రమమిదియే, తరువాత స్వతంత్ర రచనము సన్నగిల్లి అనుకరణములు బయలుదేరినవి. నేఁటి కవులు సాహిత్య రాజ్యమున పితూరీలు సలుపుట అన్యాక్రాంతమైన స్వరాజ్య మును దమపరము చేసికొనుటకే యని రసలుబ్ధుఁడు గ్రహించుఁగాక !

నాటక రచనముగూడ నొకప్పుడు ప్రభవించి క్రమ క్రమముగ నభివృద్ధి చెందినదే. భరతముని నాట్యశాస్త్రమునకుఁ బూర్వము ఎట్టి ప్రేక్షణీయకము లుండినదియు మన మెఱుఁగము. కంసవధ, బలిబంధనము, అను రూపకముల పేరులు పతంజలి యుదాహరించెనేగాని యాపురాతన రచనల తత్త్వమెట్టిదో మన మెఱుఁగము, సౌమిల్లి కవిపుత్రాదుల రూపకములు మనకు లభింప లేదు. మన పూర్వ పుణ్యవశమున భాసుని రచనలు లభించినవి. భాసుని రూపకములకును దరువాతి కాళిదాసాదుల నాటకముల