పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/243

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

237


గళేబరము నేల వ్రాలదాయనియు, ఒక వేళ అట్లు వ్రాలనీయక “బ్రాడ్లీ ప్రభృతుల ట్రాజెడీ సంచిలోని క్రొత్త సంజీవనిం దెచ్చిపోసి నిలుపఁ గలమా? ఆమందు త్రాగి కులము చెడినను ఎం దేని బ్రతికి ఊర్జితముగా నుండునేమొ” అని కులముచెడని తన పౌరాణిక మనస్తత్త్వమును, సందేహమును, రసలుబ్ధుఁడు వెల్లడించినాఁడు. ఈ పురాణ పురుషుని వగపునకును సందేహమునకును గాగణము కాలానుగుణముగఁ దలసూపు మార్పులను గుర్తింపనేరమి యని యే నాతలంపు.

లక్షణములు శాసనములా ? లాక్షణికులకు అను శాసించు అధికారముము ఎవరివలనఁ గలిగినది? ఆ యధికారము వారు స్వయముగఁ దెచ్చిపెట్టుకొన్నదా ఇతరు లిచ్చినదా? లణములకు లక్ష్యములకుఁగల సంబంధ మేమి? నాటక లక్షణము లిఁకమీఁదఁ బుట్టుటకు అవకాశము లేదా? సాహిత్య దర్చణములోని నాటక లక్షణములు ఇప్పటి నాటక రచయితల నెంతవఱకు బంధించును? శృంగార వీరములే నాటకమునఁ బ్రధాన రసములుగ నుండవలయునా? రసాభాస సిద్ధాంతము 'ట్రాజెడి' లకును జెల్లునా? అను ఈ విషయములను మనము విచారించి నిగ్గుదేల్చిననే గాని "శాసన వ్యాప్త సాహిత్య రాజ్యమున పితూరీలు ” లేఁపు స్వాతంత్ర్య ప్రియులైన నేఁటికాలపు కవుల యుద్యమముయొక్క గౌరవమును మనము గ్రహింపలేము.

కళలువోలె తదంతర్గతములగు లక్షణములును స్వయంభవములు. అవి ప్రతిభాశాలులైన కవుల భావ ప్రపంచమున నుద్భవించి రచనాముఖమున వ్యక్తమగును,