పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/242

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

(శ్రీ దువ్వూరి రామిరెడ్డిగారిచే రచింపబడిన “మీరాబాయి" అను వధాంత నాటకము నెల్లూరి వెంకటగిరిరాజాగారి కళాశాల "ప్రాంతవిద్యార్థి సంఘము" వారిచే తే {7-5-1933) దిన ప్రదర్శింపఁబడి సహృదయులగు ప్రేక్షకుల సంస్తుతికిఁ బాత్రమైనది. అప్పటినుండి కొంతకాలమువఱకు ఆనాటకమును - గుఱించిన బాగోగుల వివాదములు స్థానిక పత్రికలయందుఁ బ్రచురింపఁ బడినవి. అప్పుడు నెల్లూరినుండి వెలువడుచుండిన “'Scrutator" అను పత్రికయందు “రసలుబ్ధుఁడు” “మీరాబాయి"ని గురించి ఒక విమర్శనము రచించి ప్రకటించెను. శ్రీ దు. రామిరెడ్డిగారు “కళా ప్రియుడు" అనుపేరుతో అదే పత్రికయందు “కసలుబ్ధుని" యాక్షేపములకుఁ బ్రత్యుత్తర మిచ్చెను. ఈ విమర్శనము పాఠకులకు ఉపయోగపడునకు ఉద్దేశముతో ఈ సంపుటిలో చేర్చినాము. :--సం.)

"శృంగార మేగాని వీరమేగాని ఒకటేరసము అంగి, కడమ రసములన్నియు అంగములు” అను నిట్టివి మఱికొన్ని సాహిత్యదర్పణములోని నాటక లక్షణముల నుదాహరించి, ఆ లక్షణములను బట్టిచూడ మీరాబాయి నాటకమున రసాభాసము కలిగినదని తీర్మానించి, [రసాభాస మన్నంతనే, అదేదో గుణలోపమని పామరుల యూహ; అది యట్టిది కానేకాదు. అదియొక పారిభాషిక పదమని పెద్ద లెఱుఁగుదురు.) "ఇత్యాది శాసనవ్యాప్త సాహిత్య రాజ్యమున హౌణాది విదేశబల సాహాయ్యమున శాసనము లుల్లంఘించి పితూరీలు రేపుచున్నారుగదా ఇప్పుడు కవులు!" అని కాల విపర్యాసమునకు వగచి, ప్రాణమైన రసము దెబ్బతినఁగాఁ