పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిక్కన

235


పులు పగిలి పెట్లదిమ్మలవలె శబ్దించును, అటువంటి శబ్దములతోను, అట్టహాసాది గర్జనముతోను, భేరి వాయించునప్పుడు దానిచర్మము పగిలిన ఎంత శబ్దమువచ్చునో అంత శబ్దముతోను వారు పోరినారట! ఈ అల్లకల్లోలమునకు రాజగృహములోని వారేకాక యూరివారందరు ఉలిక్కి పడి లేచి యుందురు. తిక్కన పూర్వాపర సందర్భ వైరుధ్యము కలగకుండునట్లు...

తనయగ పాటొరు లెఱుఁగుదు
రని సూతుఁడు, సమయభంగమగుటకు భీముం
డును గొంకుచుఁ జప్పుడు సే
యని గూఢవిమర్ధన ప్రహారముల దగన్ .

అని యుచితముగ మార్చి రహస్య యుద్ధమునకు కారణములుకూడ చూపెను.

నూటికి నూలుపోగనునట్లుగా తిక్కన కావ్యగుణములను సూక్ష్మముగ తడవి యింతటితో విరమించుచున్నాను. (- ఆలిండియా రేడియోవారి సౌజన్యంతో...)


___________