పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిక్కన

229


అధర్వణాచార్యుడు భారతము రచించెనని వినికిడి. అదేమైనది? దానినిగుఱించి కొన్ని కట్టుకథలు ప్రబలినవి. అయితే యీ మధ్యకాలమున భారతమును తెనిగింపగల మహాకవి ఆంధ్రదేశమున లేడా? రామాయణమంతటి బృహత్కావ్యమును నిర్వహించిన భాస్క రాదులున్నారుగదా. బహుశా అరణ్యపర్వమును గుఱించిన మూఢవిశ్వాసము కొద్దిపాటి మార్పులతో తిక్కన నాటికిగూడ వ్యాపించి యుండినదేమొ? ఇటువంటి విశ్వాసములకు కారణభూతమైన అరణ్యపర్వ శేషమును వదలిపెట్టి విరాటపర్వము మొదలు పదునేనింటిని తెనిగించెను,

నన్నయకును తిక్కనకును షుమారు రెండువందల సంవత్సరముల కాలవ్యత్యాసమున్నది. ఈ మధ్యకాలమున రాజకీయ సాంఘిక విషయములందేమి, భాషావిషయము నందేమి. ప్రజల యాచార వ్యవహారములందేమి కొన్ని మార్పులు తప్పక జరిగియుండవలయును. నన్నయ తిక్క నల కావ్యప్రయోజన దృష్టి భేదములకు ఈ మార్పు లే బాధ్యములై యుండవచ్చును. నన్నయ వైదిక దృష్టితోను, జగద్ధిత బుద్దితోను భారత రచనకు పూనుకొనెను. తిక్కన శిల్పదృష్టితోను "ఆంధ్రావళి మోదముం బొరయించు” బుద్ధితోను భారత రచన కొనసాగించెను.

తిక్కన కాలమునకే ఆంధ్రులు, ఆంధ్రత్వము అను నొక ప్రత్యేకత, సాంఘిక జ్ఞానము అంకురించి యుండినది. ఈనాటి గాంథిక, వ్యవహారిక భాషావాదములవలెనే