పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/234

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తిక్కన

సుహాభారతాంధ్రీకరణముతోడ ఆంధ్రుల నాగరక జీవితము ప్రారంభమైనదని చెప్పవచ్చును. గాసట బీసటే చదివి సంతృప్తిపడు ఆంధ్రులకు సర్వలక్షణ సమన్వితమైన భాష కవిత్వము చేకూడినది. వైదికమతము వ్యాపింపజేయ వలయుననే కోర్కెయే భారతాంధ్రీకరణమునకు మూల కారణము, రాజరాజు వైదికమతాభిమాని కావున నన్నయను ఆ మహాకార్యమున నియోగించి ఆదరించెను. మొట్ట మొదటి యుద్దేశ మెట్టిదైనను ఆంధ్రులకు ఆంధ్రభాషకు మహోపకార మొనగూడినది.

అరణ్యపర్వము పూర్తి కాకపూర్వమె నన్నయ అస్తమించెను. ఆయన మరణము వింతవింత కింవదంతులకూ ఊహలకూ ఆకరమైనది. “అసలు సంస్కృత భారతమును తెనుగు చేయడమే ఒక గొప్ప అపచారము. కాబట్టి దుఃఖ భాజసమైన అరణ్యపర్వము పూర్తిగాక మునుపే నన్నయ మరణించినాడు” అను నమ్మకము దేశమున వ్యాపించినది. దీనిలో ఆశ్చర్యమేమిన్నీ లేదు. నాగరక యుగమని చెప్పుకో బడే యీ యిరవయ్యో శతాబ్దమునకూడ ఇట్టి విశ్వాసములు నాటుకొనియున్నవి.

రెండువందల సంవత్సరములు గడచిన వెనుక తిక్కన యవతరించి ఈ యాంధ్రీకరణ భారము వహించువరకు ఈ పనికి పూనుకొన్న వారు లేరు. తలపెట్టి వారుండవచ్చును.