పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/233

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నా కవితానుభవములు

227

అని వోదార్చినాను. ఇద్దరం భాయి భాయి అనుకొన్నాము. విరహాంతరమువల్ల మా సమాగమం ప్రణయ చిక్కణంగా కనిపించింది. తర్వాత ఫలిత కేశం కనుపించి:

చెలువలు ప్రేముడిం గదుము చిక్కని కౌగిళులన్ సుఖించి ని
చ్చలు మధురాధరామృతరసంబున మత్తిలి యౌవనంబు ని
శ్పలమని యెంచి కామపరిచర్య యొనర్చుచు భావికాల చిం
తలు తలపెట్టబోని పశుతత్త్వుని నిద్దురలేప వచ్చితిన్.

అంటూ హెచ్చరించింది. పాపం! నా యిల్లాలి ముఖం మేఘాచ్చన్నమైంది చూచాను.

అతివ పొరపాట్ల ప్రహసనం బాడినాము
భరత వాక్యంబుగాఁబెట్టు వలపు ముద్దు;

అని ఒక ముద్దు ముద్రించాను. --(ఆలిండియా రేడియోవారి సౌజన్యంతో.)


____________